![క్లాస్‌రూమ్‌లో పడుకున్న స్టూడెంట్.. తాళం వేసి వెళ్లిన టీచర్స్](https://static.v6velugu.com/uploads/2025/02/student-found-sleeping-in-classroom-at-shayampet-primary-school_wAPa4t7xdH.jpg)
- నాగర్‌కర్నూల్ జిల్లా శాయిన్‌పేట ప్రైమరీ స్కూల్‌లో ఘటన
లింగాల, వెలుగు : ఒకటో తరగతి స్టూడెంట్ క్లాస్‌రూమ్‌లో పడుకోగా.. అతడిని గమనించని టీచర్స్ గదికి తాళం వేసి వెళ్లిపోయారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని శాయిన్‌పేట ప్రైమరీ స్కూల్‌లో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్లే... గ్రామానికి చెందిన మల్లేశ్ కుమారుడు శరత్ స్థానిక స్కూల్‌లో ఒకటో తరగతి చదువుతున్నాడు. బుధవారం స్కూల్ ముగిసిన తర్వాత టీచర్లు అన్ని గదులకు తాళాలు వేసి ఇంటికి వెళ్లిపోయారు.
స్కూల్ టైం ముగిసినా శరత్ ఇంకా ఇంటికి రాకపోవడంతో అతడి తండ్రి మల్లేశ్ స్కూల్‌కు వెళ్లి గదిలో పరిశీలించగా బాలుడు పడుకొని కనిపించాడు. దీంతో వెంటనే తాళాలు పగులగొట్టి శరత్‌ను బయటికి తీసుకొచ్చాడు. ఈ విషయంపై హెచ్‌ఎం గణేశ్ మాట్లాడుతూ మధ్యాహ్నం మూడు గంటల తర్వాత స్టూడెంట్లను బయట కూర్చోబెట్టామని, సాయంత్రం స్కూల్ ముగిసిన తర్వాత టీచర్ క్లాస్‌రూమ్స్‌ను పరిశీలించకుండానే తాళాలు వేసినట్లు చెప్పారు.