ఆన్ లైన్ జాబ్ ఇస్తమని చీటింగ్

ఆన్ లైన్ జాబ్ ఇస్తమని చీటింగ్

ఘట్ కేసర్, వెలుగు: ఆన్ లైన్ జాబ్ పేరిట విద్యార్థిని మోసపోయింది. పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ లక్ష్మీనరసింహస్వామి కాలనీకి చెందిన విద్యార్థిని(20) సెల్ ఫోన్ కు ఈనెల 13న ఓ మెసేజ్ వచ్చింది. మంచి శాలరీతో ఆన్ లైన్ జాబ్ ఇస్తామని అందులో ఉండగా.. మెసేజ్ లింక్ ను క్లిక్ చేసింది. వెంటనే గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ప్రముఖ సంస్థలో జాబ్ వచ్చిందని,  ఆమె మొబైల్ కు వచ్చిన ఓటీపీని చెప్పాలని తెలిపాడు. దీంతో ఓటీపీ చెప్పగా.. మరుసటి రోజు ఆమె బ్యాంక్ ఖాతాలోని నగదు వేరే అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ అయినట్టు మెసేజ్ వచ్చింది.

జాబ్ ఇస్తామని చెప్పిన వ్యక్తికి విద్యార్థిని ఫోన్ చేసి మాట్లాడగా.. డబ్బులు తిరిగి రావాలంటే మరికొంత నగదు పంపాలని సూచించాడు. దీంతో మోసపోయానని గుర్తించిన ఆమె పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు మంగళవారం కంప్లయింట్ చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఆధార్ అప్ డేట్ పేరిట.. 60 వేలు కొట్టేశారు 

ఘట్ కేసర్ టౌన్ కు చెందిన డి. నర్సింహ్మ మొబైల్ వాట్సాప్ నకు సోమవారం ఆధార్ నంబర్ అప్ డేట్ చేసుకోవాలని యూనియన్ బ్యాంక్ పేరిట మెసేజ్ వచ్చింది.  మెసేజ్ లింక్ ఓపెన్ చేసి ఆధార్ అప్ లోడ్ చేశాడు.

మంగళవారం ఉదయం రూ.60, 600 పలుమార్లు అతని బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్ ఫర్ అయ్యాయి.  బాధితుడు నర్సింహ్మ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ ఎస్ . సైదులు తెలిపారు.