
- కరీంనగర్ లోని సెంటర్ లో ఘటన
కరీంనగర్ సిటీ, వెలుగు: ఇంటర్ఎగ్జామ్ రాస్తుండగా ఫ్యాన్ ఊడి పడడంతో విద్యార్థినికి తీవ్ర గాయాలు అయ్యాయి. కరీంనగర్ సిటీలోని సహస్ర జూనియర్ కాలేజీ సెంటర్‌లో బుధవారం ఆల్ఫోర్స్ కాలేజీకి చెందిన శ్రీవాన్విత ఇంటర్ సెకండియర్ మ్యాథ్స్ –1 పరీక్ష రాస్తుండగా.. సీలింగ్ ఫ్యాన్ ఊడి ఆమెపై పడింది. ఫ్యాన్ రెక్కలు చెంప, ముక్కుకు తగలడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆమెను కాలేజీ సిబ్బంది ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.