- భోగి మంటల్లో చిన్నారికి గాయాలు
నిజామాబాద్ టౌన్, వెలుగు: నిజామాబాద్‌లో ఓ ప్రైవేటు స్కూల్లో నిర్వహించిన సంక్రాంతి ముందస్తు సంబురాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. భోగి మంటలు అంటుకొని సెకండ్ క్లాస్స్టూడెంట్కు గాయాలయ్యాయి. వర్ని రోడ్డులోని సెయింట్ జేవియర్స్ స్కూల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా శనివారం భోగి మంటలు వేశారు. మంటలు వేయడానికి పెట్రోలు ఉపయోగించగా, ఒక్కసారిగా మంటలు ఎగసిపడి రెండో తరగతి చదువుతున్న కోమలి ట్రెడిషనల్ దుస్తులకు అంటుకున్నాయి.
దీంతో బాలిక కాళ్లకు తీవ్ర గాయాలు అవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. స్కూల్ యాజమాన్యం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థిని తండ్రి జనార్దన్ ఐదో టౌన్ పీస్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గంగాధర్ తెలిపారు.