చందానగర్లో కరెంట్ షాక్తో విద్యార్థినికి గాయాలు.. బాధిత కుటుంబసభ్యుల ఆందోళనతో వెలుగులోకి ఘటన

చందానగర్లో కరెంట్ షాక్తో విద్యార్థినికి గాయాలు.. బాధిత కుటుంబసభ్యుల ఆందోళనతో వెలుగులోకి ఘటన

చందానగర్, వెలుగు: స్కూల్లో కరెంట్​షాక్​తగిలి​విద్యార్థిని ప్రాణపాయ స్థితిలో ఉంటే, యాజమాన్యం కనీసం స్పందించట్లేదని బాధిత కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా రావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల కథనం ప్రకారం.. చందానగర్ లోని రెయిన్​బో స్కూల్లో గౌరీ (12) ఆరో తరగతి చదువుతోంది. మార్చి1న తన స్నేహితురాలితో కలిసి స్కూల్లో షటిల్ ఆడుతుండగా, కాక్ కరెంట్ వైర్లపై పడింది. 

ఇనుపరాడుతో కాక్​ను తీసేందుకు గౌరీ ప్రయత్నించగా, కరెంట్​షాక్​తో ఆమె చేతులు, కడుపుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధితురాలిని స్థానికులు సమీప హాస్పిటల్​కు తరలించారు. అయితే, వారం రోజులుగా గౌరీ ఐసీయూలో చికిత్స పొందుతున్నా యాజమాన్యం పట్టించుకోవట్లేదని బాధిత కుటుంబసభ్యులు శుక్రవారం స్కూల్​ఎదుట ఆందోళనకు దిగారు. 

ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపాల్ అందుబాటులోకి రాకుండా తప్పించుకు తిరుగుతున్నారంటూ వాపోయారు. ఇప్పటికే గౌరీ తండ్రి క్యాన్సర్ తో పోరాడుతున్నాడని, ఇప్పుడు కూతురు పరిస్థితి కూడా విషమంగా ఉందని తల్లి సంపూర్ణ కన్నీరుమున్నీరుగా విలపించారు. తన బిడ్డకు న్యాయం జరిగే వరకు స్కూల్ యాజమాన్యంతో పోరాటం చేస్తామని తెలిపారు.