ఉర్దూ టీచర్ల పోస్టులు భర్తీ చేయాలి .. ఇస్లామిక్ ఆర్గనైజేషన్ డిమాండ్

ఉర్దూ టీచర్ల పోస్టులు భర్తీ చేయాలి .. ఇస్లామిక్ ఆర్గనైజేషన్ డిమాండ్
  • ధర్నా చౌక్​లో స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ నిరసన

ముషీరాబాద్, వెలుగు: తెలంగాణలో ఖాళీగా ఉన్న 666 ఉర్దూ టీచర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇందిరా పార్కు ధర్నా చౌక్ లో సోమవారం వారు నిరసన చేపట్టారు. రాష్ట్రంలో ఉర్దూ ఉపాధ్యాయుల పోస్టులు 1183 ఉండగా, 570 పోస్టులు మాత్రమే భర్తీ చేశారన్నారు. మిగతా 666 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 

డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరగాలంటే, సెకండ్ మెరిట్ లిస్ట్ తీసి దాని ద్వారా ఉర్దూ మీడియం పోస్టులు భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆర్గనైజేషన్ ప్రతినిధులు ఫిరోజ్ ఖాన్, అబ్దుల్ తాజ్, పాషా, మహ్మద్ ఖలీద్, ఉర్దూ మీడియం డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు.