క్రీస్తుజ్యోతి కాలేజీలో బిల్డింగ్ పై నుంచి దూకిన విద్యార్థిని

క్రీస్తుజ్యోతి కాలేజీలో బిల్డింగ్ పై నుంచి దూకిన విద్యార్థిని

జనగామ, వెలుగు : జనగామ శివారు యశ్వంతాపూర్​క్రీస్తు జ్యోతి ఇంజినీరింగ్​కాలేజీలో సోమవారం బీటెక్​ఫస్ట్​ఇయర్​చదువుతున్న సంతోషిణి అనే స్టూడెంట్​ గాయపడింది. తోటి స్టూడెంట్స్​ కాలేజీ యాజమాన్యానికి చెప్పడంతో వారు జనగామ జిల్లా జనరల్​హాస్పిటల్​ కు తరలించారు.  అక్కడి నుంచి మెరుగైన ట్రీట్​మెంట్​ కోసం హైదరాబాద్​కు తరలించారు. అయితే, మేనేజ్​మెంట్​ జారి పడిందని చెబుతుండగా, బిల్డింగ్​ మీద నుంచి దూకినట్టు ప్రచారం జరుగుతోంది.

విషయం తెలుసుకున్న సీఐ శ్రీనివాస్​సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రస్తుతం సంతోషిణి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని తెలిపారు. కాలేజీ గేట్లు మూసి ఉండడంతో ప్రహరీ దూకి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించే క్రమంలో జారిపడగా చేతికి, వెన్నెముక భాగంలో గాయాలైనట్లు స్టూడెంట్లు చెబుతున్నారు. ఈ విషయమై కాలేజీ డైరెక్టర్​ అగస్టీన్​ రెడ్డి మాట్లాడుతూ సంతోషిణి ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల  కిందపడిపోయిందని స్టూడెంట్లు తనకు చెప్పారన్నారు. ఆమెను హాస్పిటల్​కు తరలించి పేరెంట్స్​కు సమాచారం ఇచ్చామన్నారు.