లోక్‌ సభ ఎన్నికల బరిలో యువతరం

ఈసారి లోక్‌ సభ ఎన్నికల బరిలో యువతరం ఎక్కువగా కనిపిస్తది. వీరిలో ఎక్కువ మంది స్టూ డెంట్ లీడర్లు గా పేరు తెచ్చుకున్నవారే. ‘యూత్’ కోటాలో వీరు టికెట్లు తెచ్చుకున్నారు. రాజకీయ అనుభవం లేకున్నా పొలిటికల్‌ రంగంలో హేమా హేమీలకు గట్టి పోటీ ఇస్తున్నారు. దేశవ్యాప్తం గా అందరి దృష్టి ఆకర్షిస్తు న్నారు. పంచాయతీ స్థాయిలోనైనా పాలిటిక్స్‌ తెలియని వాళ్లు పార్లమెంట్‌‌‌‌కి రెడీ అయ్యారు. అసెంబ్లీ గడప తొక్కని కుర్రకారు లోక్‌ సభ బరిలో అదృష్టాన్నిపరీక్షించుకుంటున్నారు.

బీరేంద్రకుమార్ గొడ్డా

జార్ఖండ్ లోని గొడ్డా నియోజకవర్గం నుంచి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ మాజీ స్టూడెంట్ లీడర్ బీరేంద్రకుమార్ పోటీలో ఉన్నాడు. ఇద్దరు రాజకీయ యోధులను ఆయన ఇక్కడ ఎదుర్కొంటున్నారు. బీజేపీ తరఫుననిషికాంత్ దూబే, కూటమి తరఫున ప్రదీప్ యాదవ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు . బీరేంద్ర కుమార్ కు ఆదివాసీల తరఫున పోరాడిన లీడర్​గా ఈ ఏరియాలో పేరుంది. అలాగే కార్మిక హక్కులకోసం జరిగిన అనేక పోరాటాలకుఆయన నాయకత్వం వహించారు. ఆదివాసీల పై కార్పొరేట్ శక్తుల పెత్తనానికి వ్యతిరేకంగానే తాను పోటీచేస్తున్నట్లు బీరేంద్ర కుమార్ చెప్పారు . (పోలింగ్ తేదీ: మే 19 –ఫేజ్ 7)

రాజు యాదవ్ (అరా)

అనేక రైతాంగ పోరాటాల్లో పాల్గొన్న రాజు యాదవ్ బీహార్‌ లో ని అరా సెగ్మెంట్ నుంచి సీపీఐ (ఎంఎల్)టికెట్‌‌‌‌పై లోక్‌ సభ బరిలో నిలిచాడు. రైతు కూలీల ఉద్యమంలో పనిచేసిన అనుభవం రాజు యాదవ్‌‌‌‌కి ఉంది. ఆశా, అంగన్‌ వాడి వర్కర్ల సమస్యలపై కూడా పోరాడాడు. అరా నియోజకవర్గంలో వ్యవసాయ కూలీల నాయకుడిగా రాజు యాదవ్ కు మంచి పేరుంది.రైతు కూలీలకు కనీస హక్కుల కోసం జరిగిన అనేక పోరాటాల్లో సీపీఎం (ఎంఎల్) తరఫున ఆయనపాల్గొన్నాడు. ఆదివాసీ హక్కులను దెబ్బతీయడానికి కార్పొరేట్ శక్తులు ప్రయత్నించినప్పుడు గిరిపుత్రులకు అండగా నిలిచాడు. (పోలింగ్ తేదీ: మే 19 –ఫేజ్ 7)

కన్హయ్య కుమార్ (బెగుసరాయ్)

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్‌ గా కన్హయ్య కమార్ దేశవ్యాప్తంగా పాపులర్. 2016 లో జరిగిన ఓ కార్యక్రమంలో ఇండియాకి వ్యతిరేకంగా నినాదాలిచ్చి అందరి దృష్టిలో పడ్డారు. అలాగే పార్లమెంటుపై దాడి సంఘటనలో కీలకపాత్ర పోషించిన అఫ్జల్ గురును ప్రశంసించారు. ఈ నేపథ్యంలో కన్హయ్యకుమార్‌ పై పోలీసులు దేశద్రోహం కేసు ఫైల్ చేశారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రిగిరిరాజ్ సింగ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. 2014 లోక్‌ సభ ఎన్నికల్లో బెగుసరాయ్ లోక్‌ సభసీటుని బీజేపీ గెలుచుకుంది. అయితే, అప్పట్లో సీపీఐ కేండిడేట్ రాజేంద్ర సింగ్ ఇక్కడథర్డ్ ప్లేస్‌‌‌‌లో నిలిచారు. ఈసారి ఎన్నికల్లో సీపీఐ తరఫున తురుపు ముక్కగా కన్హయ్యకుమార్ ను పార్టీ పోటీలోకి దింపింది. పార్టీ పరంగా వచ్చే ఓట్లతో పాటు కన్హయ్యకుమార్‌ కి ఉన్న పాపులారిటీ కూడా సీపీఐ విజయావకాశాలను పెంచుతుందని భావిస్తున్నారు . సహజంగా నార్త్ ఇండియాలో లెఫ్ట్ పార్టీలకు పెద్దగా పలుకుబడి ఉండవని చాలా మంది అనుకుంటారు. అయితే ఇది కరెక్ట్ కాదు. బీహార్ లోని కొన్నిప్రాంతా ల్లో సీపీఐకు చెప్పుకో దగ్గ పట్టు ఉంది. (పోలింగ్ తేదీ: ఏప్రిల్ 29 –ఫేజ్ 4)

స్నేహ కాలే (ముంబై నార్త్ సెంట్రల్)

ట్రాన్స్‌ జెండర్ల హక్కుల కోసం పోరాడటానికే తాను ఎన్నికల బరిలో నిలిచానన్నారు స్నేహ కాలే.సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తమ సమస్యలనుపార్లమెంట్‌‌‌‌ ముందు ఉంచాలన్నది స్నేహ నిర్ణయం.పార్లమెంటులో ట్రాన్స్‌ జెండర్లవాయిస్ వినిపించడానికిపోటీ చేస్తున్నారు.మనుషుల్లా పుట్టినందుకు ఆడవారికి, మగవారికిఉన్నట్లుట్రాన్స్‌ జెండర్లకుకూడాహక్కులుంటాయని ప్రచారంలో చెబుతున్నారు .(పోలింగ్ తేదీ:ఏప్రిల్ 29 –ఫేజ్ 4)

బీరజ్ దేకా (కోక్రాఝార్‌‌‌‌)

లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేస్తు న్న అత్యంత చిన్నవాడు బీరజ్ దేకానే. 26 ఏళ్లదేకా అస్సాంలోని కోక్రాఝార్‌ నియోజకవర్గం నుంచి సీపీఐ (ఎం)కేండిడేట్‌‌‌‌గా పోటీలో ఉన్నాడు. ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధిచేయడానికి తాను కట్టుబడి ఉన్నానన్నాడు దేకా. రాజ్యాంగం ఇచ్చినహక్కులు ప్రజలకు అందేలా చేస్తానన్నాడు.(పోలింగ్ తేదీ: ఏప్రిల్ 23 –ఫేజ్ 3)

తేజస్వి సూర్య (బెం గళూరు సౌత్)

దక్షిణ బెంగళూరు లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ కేండిడేట్‌‌‌‌గా నిలిచినతేజస్వి సూర్య 28 ఏళ్ల కుర్రవాడు. కేంద్రమంత్రి అనంతకుమార్ ఆరుసార్లు గెలిచిన ఈ సీటులో పోటీ చేసే అవకాశం తేజస్వి కి దక్కింది.అలాగని రాత్రికిరాత్రి పాలిటిక్స్‌ లోకి వచ్చిన వ్యక్తి కాదు. స్టూడెంట్‌‌‌‌ రోజుల్లో ఏబీవీపీలో పనిచేశాడు. ప్రస్తుతం లాయర్‌ గా ప్రాక్టీస్‌‌‌‌ చేస్తూ , బీజేపీ యువమోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగాపాల్గొని ‘ఫైర్ బ్రాండ్’గా గుర్తింపు పొందాడు. అనేకసార్లు తేజస్వి కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. యువతకు ఎక్కువ సీట్లు ఇవ్వాలన్న పార్టీ నిర్ణయంలో భాగంగా తేజస్వికి టికెట్ ఇచ్చినట్లు బెంగళూరు సౌత్ బీజేపీ వర్గాలు చెప్పాయి. ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్‌‌‌‌గా ప్రస్తుత రాజ్యసభసభ్యుడు బి.కె.హరిప్రసాద్ పోటీలోఉన్నారు.(పోలింగ్ తేదీ: ఏప్రిల్ 18 –ఫేజ్ 2)