విద్యా రంగానికి 30 శాతం నిధులివ్వాలి 

విద్యా రంగానికి 30 శాతం నిధులివ్వాలి 
  • అసెంబ్లీ ముట్టడికి  విద్యార్థి సంఘాల యత్నం

బషీర్ బాగ్, వెలుగు: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ప్రగతి ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, ప్రగతిశీల యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థి నాయకులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు పి.మహేశ్, పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఇందూరి సాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. పెండింగ్ స్కాలర్​షిప్​లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర బడ్జెట్ లో విద్యా రంగానికి కనీసం 30% నిధులు  కేటాయించాలని కోరారు. విద్యాశాఖ మంత్రిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ ఖాళీలపై అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలను రద్దు చేయాలని కోరారు.