విద్యార్థిని కరిచిన ఎలుక.. చచ్చు పడిపోయిన కాలు, చెయ్యి

విద్యార్థిని కరిచిన ఎలుక.. చచ్చు పడిపోయిన కాలు, చెయ్యి
  • ఖమ్మంలో ఆలస్యంగా వెలుగులోకి వచిన ఘటన 
  • రాబిస్ వ్యాక్సిన్ వేయించాం: ఆర్ సీవో

ఖమ్మం: ఖమ్మం దానవాయిగూడెం బీసీ వెల్ఫేర్ గురుకులంలో దారుణం చోటుచేసు కుంది. గత ఫిబ్రవరిలో పదవ తరగతి చదువుతున్న సమయంలో విద్యార్థిని భవానీ కీర్తిని ఎలుక కరిచింది. ఎలుక కరిచిన తరువాత బాధిత విద్యార్థిని కాలు, చెయ్యి చచ్చుపడిపోయిన దశలో హాస్పటల్లో చికిత్స పొందుతోంది.

ఈ విషయంపై గురుకుల స్కూల్ ఆర్ సీవో మాట్లాడుతూ.. ఎలుక కరిచినట్లు విద్యార్థిని తమ దృష్టికి తెచ్చాక.. రాబిస్ వ్యాక్సిన్ వేయించిన్నట్లు తెలిపారు. గతంలో నాలు గుసార్లు ఎలుకలు తన బిడ్డను కరిచాయి అని విద్యార్థిని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. చూశారుగా.. ఎలుకలు కూడా ప్రమాదమే. ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉంటే ఎలుకల పట్ల అప్రమత్తంగా ఉండండి.