జేఎన్​టీయూ బిల్డింగ్​ పైనుంచి దూకి విద్యార్థిని సూసైడ్

జేఎన్​టీయూ బిల్డింగ్​ పైనుంచి దూకి విద్యార్థిని సూసైడ్
  • మానసిక ఒత్తిడే కారణమని పోలీసుల వెల్లడి

కూకట్​పల్లి, వెలుగు: హైదరాబాద్​లోని కూకట్​పల్లిలో గల జేఎన్​టీయూ బిల్డింగ్​పై నుంచి దూకి విద్యార్థిని సూసైడ్​ చేసుకుంది. అనారోగ్య సమస్యలు, తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగానే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా పోలీసులు తెలిపారు. ఏపీలోని నెల్లూరుకు చెందిన మనోజ్​కుమార్​రెడ్డి కూకట్​పల్లి వివేకానందనగర్ ​కాలనీలో స్థిరపడ్డారు. ఇతని కూతురు మేఘనారెడ్డి(21) జేఎన్​టీయూలో సీఎస్​యూ గ్రూప్​ఫోర్త్​ ఇయర్ ​చదువుతోంది. ఎంసెట్​లో 200 ర్యాంక్​ సాధించిన మేఘన బీటెక్​లో కూడా మంచి పర్సెంటేజీ మార్కులతో పాసవుతూ వస్తోంది. అయితే, కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతోంది. దీనికోసం ట్రీట్​మెంట్ కూడా తీసుకుంటోంది. ఈ విషయంలో కుటుంబ సభ్యులతో పాటు వర్సిటీ అధ్యాపకులు కూడా మేఘన పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుండేవారు. కొన్ని రోజులుగా మేఘన తల్లి మధ్యాహ్నం స్వయంగా లంచ్​ బాక్స్​ తీసుకువచ్చి కూతురికి తినిపించి వెళ్తోంది. బుధవారం మధ్యాహ్నం కూడా ఆమె వచ్చి లంచ్​ తినిపించి వెళ్లింది. ఆ తర్వాత 3 గంటల సమయంలో మేఘన వర్సిటీ బిల్డింగ్​మూడో అంతస్తు నుంచి కిందకు దూకింది. వెంటనే వర్సిటీ సిబ్బంది, స్టూడెంట్స్​ ఆమెను సమీపంలోని ప్రైవేటు హాస్పిటల్​కు తరలించారు. అక్కడ డాక్టర్లు ట్రీట్​మెంట్​ఇస్తుండగానే మేఘనారెడ్డి మృతి చెందింది. కేపీహెచ్​బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.