ఇంటర్ సప్లిమెంటరీలో ఫెయిల్ అవుతానేమోనని ఆత్మహత్య

భూదాన్ పోచంపల్లి, వెలుగు: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై విక్రమ్ కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి నరసింహ కొడుకు మణిశంకర్ (17) హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ కాలేజీలో  ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. 

ఫస్టియర్​లో ఫెయిలై సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ​రాశాడు. రిజల్ట్స్ రాబోతున్న క్రమంలో ఫెయిల్ అవుతానని భావించి మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.