వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల స్కూల్ లో 7వ తరగతి విద్యార్థిని నందిని జ్వరంతో చనిపోయింది. అయితే స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే నందిని చనిపోయిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. 10 రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నా స్కూల్ యాజమాన్యం పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. నందిని డెడ్ బాడీతో స్కూల్ ముందు ఆందోళన చేస్తున్నారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.