హీరోయిన్తో అసభ్యంగా ప్రవర్తించిన స్టూడెంట్

ఆకాశమే నీ హద్దురా మూవీ ఫేం హీరోయిన్ అపర్ణా బాలమురళీకి చేదు అనుభవం ఎదురైంది.  మూవీ ప్రోమషన్ లో భాగంగా కాలేజ్ ఈవెంట్లో పాల్గొన్న ఆమెపై ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


అపర్ణా బాలమురళీ, వినీత్ శ్రీనివాసన్ కలిసి నటించిన మూవీ తన్కమ్. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా కేరళలోని ఓ లా కాలేజీలో జరిగిన ఫంక్షన్ లో పాల్గొన్నారు. అయితే ఓ యువకుడు స్టేజ్ పైకి వచ్చి అపర్ణాకు ఫ్లవర్ ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అంతటితో ఆగకుండా ఆమెను నిలబడమని చెప్పి  ఆమెపై   చేయి వేశాడు. దీంతో ఇబ్బందిగా ఫీలైన అపర్ణ దూరంగా వెళ్లింది. అపర్ణా సీరియస్ కావడంతో ఆ విద్యార్థి  సారీ చెప్పాడు. ఈ వీడియోకు కొందరు నెటిజన్లు అపర్ణకు మద్దతు తెలపగా.. స్టూడెంట్ పై విమర్శలు చేస్తున్నారు.