![పర్యావరణంపై సైకిల్ రైడ్](https://static.v6velugu.com/uploads/2023/11/student-of-spm-international-school_BuDsFUKqbW.jpg)
పర్యావరణం పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు గండిపేట మండలం నార్సింగిలోని ఎస్పీఎం ఇంటర్నేషనల్ స్కూల్ స్టూడెంట్లు గురువారం సైకిల్ రైడ్ చేపట్టారు. తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ నుంచి నార్సింగి వరకు ఉన్న ట్రాక్ పై రైడ్ నిర్వహించారు. స్కూల్ చైర్మన్ పటోళ్ల ప్రభాకర్ రెడ్డి, ప్రిన్సిపాల్ జేసుదాసు, టీచర్లు పాల్గొన్నారు.