గవర్నమెంట్​ జాబ్​ రావడం లేదని యువకుడు సూసైడ్

గవర్నమెంట్​ జాబ్​ రావడం లేదని యువకుడు సూసైడ్

మొగుళ్లపల్లి (టేకుమట్ల), వెలుగు :  ఎంత చదివినా ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడంతో తల్లిదండ్రులకు భారం కావొద్దని జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు ఆదివారం ఉదయం బావిలో దూకి సూసైడ్ చేసుకున్నాడు.   పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..  మండల కేంద్రానికి చెందిన బొమ్మ శివాజీ (24) అనే యువకుడు బీఎస్సీ  అగ్రికల్చర్  డిప్లొమా కంప్లీట్ చేసి కొంతకాలంగా ప్రైవేట్​కంపెనీలో జాబ్ చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్​ అవుతున్నాడు.  

ఇటీవల రాసిన పరీక్షతో తనకు జాబ్ రాదని,  అమ్మ నాన్నలకు భారంగా మారుతున్నానని ఆవేదన చెందాడు. దీంతో పాటు ఓ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి తన సోదరుడికి సెల్ ఫోన్​లో అమ్మ నాన్నలను బాగా చూసుకో నేను సూసైడ్​ చేసుకుంటున్నానని మెసేజ్ చేసి బావిలో దూకాడు.  వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో  బావి వద్దకు చేరుకొని స్థానికులు సాయంతో  డెడ్ బాడీని బయటకు తీశారు.