వయసుతో సంబంధం లేకుండా ఇటీవల కాలంలో చిన్నా పెద్దా గుండెపోటుకు గురవుతున్నారు. గతంలో గుండెపోటు వృద్ధులకు మాత్రమే వచ్చేది..కానీ ప్రస్తుతం స్కూల్ విద్యార్థులు కూడా గుండెపోటుకు గురవుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాలో ఓ విద్యార్థిని గుండెపోటుతో మరణించింది.
ఏం జరిగిందంటే..
కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్ లో ఫ్రెషర్స్ డే పార్టీ జరిగింది. ఆ పార్టీలో విద్యార్థిని ప్రదీప్తి డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ తర్వాత ప్రదీప్తి శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడింది. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు ఆమెకు సిపీఆర్ చేశారు. అనంతరం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రదీప్తిని ఆసుపత్రికి తరలించే క్రమంలోనే మార్గ మధ్యలోనే చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. అదేవిధంగా ప్రదీప్తికి గుండెలో రంధ్రం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రదీప్తి మృతితో ఆమె సొంత గ్రామం వెంకటాయపల్లిలో విషాద చాయలు అలుముకున్నాయి.