నిజామాబాద్ జిల్లాలో ఏం జరుగుతోంది. ఆ జిల్లాలో వరుసగా ఆత్మహత్యలు, హత్యలు, మిస్సింగ్ కేసులునమోదవుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజగా నిజామాబాద్ జిల్లాలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
నిజామాబాద్ జిల్లా మెండోరలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆర్మూర్ నరేంద్ర ఉమెన్స్ కాలేజ్ లో రక్షిత డిగ్రీ చదువుతోంది. అయితే ఆదివారం(జూన్ 18) రాత్రి హాస్టల్ లో ఎవ్వరూ లేని సమయంలో ఉరివేసుకుంది. రక్షిత మృతితో మెండోరలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రక్షితది హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ప్రేమ విఫలమవ్వడంతో రక్షిత ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు.