రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు స్టూడెంట్ ఎంపిక

జ్యోతి నగర్, వెలుగు: స్కూల్ గేమ్ ఫేడరేషన్ (ఎస్టీఎఫ్) 67వ రాష్ట్ర స్థాయి అండర్ -14 క్రికెట్ పోటీలకు రామగుండం ఎన్టీపీసీ టౌన్ షిప్కు చెందిన రాంచర్ల అశ్రీత్ ఎంపి కైనట్లు పెద్దపల్లి జిల్లా ఎసీఎఫ్ ఆర్గనైజర్ సెక్రటరీ కొమురోజు శ్రీనివాస్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. గత డిసెంబర్14న సెంటినరీ కాలనీలో జరిగిన జిల్లా స్థాయిలో క్రికెట్ పోటీల్లో సత్తా చాటి ఆశ్రీత్ రాష్ట్రస్థాయి కి ఎంపికైనట్లు చెప్పారు. ఈనెల 26 నుంచి 29 వరకు మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే పోటీల్లో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు.