హెల్సింకి: ఫిన్లాండ్లో దారుణం చోటుచేసుకుంది. ఓ స్కూల్లో 12 ఏండ్ల స్టూడెంట్తోటి విద్యార్థులపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ స్టూడెంట్మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ దేశ రాజధాని హెల్సింకి దగ్గరలోని వాన్టా సిటీలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థి కాల్పులు జరిపిన సమయంలో ఆ స్కూల్లో మొత్తం 800 మంది విద్యార్థులు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆ పాఠశాలకు చేరుకున్నారు. ఆ తర్వాత హెల్సింకి ప్రాంతంలో నిందితుడిని అరెస్ట్ చేశారు. అలాగే, అతని వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.
కాగా, మృతిచెందిన విద్యార్థితో పాటు గాయపడిన మిగిలిన ఇద్దరు విద్యార్థుల వయసు కూడా 12 ఏండ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఫిన్నిష్ ప్రధానమంత్రి పెట్టెరి ఓర్పో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గతంలో ఫిన్లాండ్ లో రెండుసార్లు ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 2007 నవంబర్ లో దక్షిణ ఫిన్‌లాండ్‌లోని టుసులాలోని జోకెలా హైస్కూల్ ప్రాంగణంలో 18 ఏండ్ల విద్యార్థి తుపాకీతో కాల్పులు జరపగా.. 9 మంది మరణించారు.