టీచర్ అయితే ఎవరికి గొప్పే.. : టీచర్ ను కాలేజీలోనే చెప్పుతో కొట్టిన స్టూడెంట్

టీచర్ అయితే ఎవరికి గొప్పే.. : టీచర్ ను కాలేజీలోనే చెప్పుతో కొట్టిన స్టూడెంట్

పిల్లలను టీచర్లు కొట్టటం చూశాం.. ఇక్కడ రివర్స్.. టీచర్ ను చెప్పుతో కొట్టింది స్టూడెంట్.. అది నాలుగు గోడల మధ్య కాదు.. కాలేజీ క్యాంపస్ బయట.. చుట్టూ నలుగురు తిరుగుతున్న ప్లేస్ లోనే.. కాలి చెప్పు తీసి మరీ టీచర్ ను కొట్టింది ఆ స్టూడెంట్.. ఎంత మంచి స్టూడెంట్ కదా.. ఇంతకీ ఆ టీచర్ చేసిన తప్పేంటీ.. ఆ స్టూడెంట్ కు ఎందుకంత కోపం అనేది తెలుసుకుందామా..

విశాఖపట్నం జిల్లా భీమిలి పట్టణం. రఘు కాలేజీ ఉంది. కాలేజీలో మొబైల్ ఫోన్లు విపరీతంగా వాడటం.. రీల్స్ చేస్తూ చదువులు అటకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఉపాధ్యాయురాలు.. తీవ్రంగా మందలించింది స్టూడెంట్స్ ను. అయినా పిల్లల్లో మార్పు రాకపోవటంతో.. ఓ విద్యార్థిని సెల్ ఫోన్ ను తీసుకున్నది ఆ టీచర్. కాలేజీ అన్నాక కొన్ని కట్టుబాట్లు.. కొంత క్రమ శిక్షణ అవసరం కదా.. ఆ ఉద్దేశంతోనే ఆ విద్యార్థిని మొబైల్ ఫోన్ తీసుకున్నది ఆ టీచర్.

Also Read : పట్టువదలని విక్రమార్కుడు.. ఐదుసార్లు విఫలమైనా

ఈ విషయాన్ని ఆ విద్యార్థి చాలా చాలా సీరియస్ గా తీసుకున్నది. క్లాస్ అయిపోయిన తర్వాత కాలేజీ క్యాంపస్ లోనే ఉన్న టీచర్ దగ్గరకు ఆవేశంగా వచ్చిన ఆ విద్యార్థిని.. నా మొబైల్ ఫోన్ ఇవ్వు అంటూ దబాయించింది. ఈ విషయంపైనే ఆ టీచర్ ఏదో చెప్పబోతుంటే.. తన కాలి చెప్పు తీసి బెదిరించింది.. అంతటితో ఆగలేదు.. ఏ మాత్రం ఆలస్యం చేయలేదు ఆ విద్యార్థి.. తన చెప్పుతో.. ఆ టీచర్ చెంప పగలగొట్టింది.. నువ్వు ఎవరు నా ఫోన్ తీసుకోవటానికి.. మా వాళ్లను ఎందుకు తిడుతున్నావ్ అంటూ గట్టిగట్టిగా అరుస్తూ టీచర్ ను చెప్పుతో కొట్టింది.

ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల ఉన్న టీచర్స్ ఆ అమ్మాయిని పట్టుకుని పక్కకు తీసుకెళ్లారు. టీచర్ అంటే భయం లేదు.. భక్తి అంతకన్నా లేదు. టీచర్ ఏదో అన్నదని.. ఆ స్టూడెంట్ టీచర్ ను చెప్పుతో కొట్టటం అంటే మాటలా మరి.. ఎంత దైర్యం కావాలి.. అప్పట్లో టీచర్ వస్తున్నారు అనగానే ఒక్కొక్కరు భయంతో వణికిపోయేవాళ్లు.. పిన్ డ్రాప్ సైలెంట్.. ఇప్పుడు టీచర్ కనిపిస్తే చాలు చెప్పుతో కొట్టే స్థాయికి వచ్చేశారు.. టీచర్ అయితే ఎవడికి గొప్ప అనే రేంజ్ లో ఉన్నారు నేటి స్టూడెంట్స్..