విశాఖపట్నంలో దారుణం జరిగింది. పియంపాలెం 6వ వార్డులోని నారాయణ విద్యాసంస్థలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి నెల్లూరు నిఖిల్ వినాయక్ శ్రీకాకులం వాసి. విద్యార్థి ఆత్మహత్యపై అనుమానం ఉందని తల్లిదండ్రులు నారాయణ సంస్థ దగ్గర నిరసన తెలిపారు. తమ కొడుకుని చంపేశారని తల్లి తండ్రులు అవేదన వ్యక్తం చేశారు. నారాయణ పాఠశాల గేటు ముందు పెద్ద ఎత్తిన ఆందోళన చేపట్టారు.
గత నెల 26న తమ అబ్బాయి నెల్లూరు నిఖిల్ వినాయక్ రూంలో ఉరి వేసుకున్నాడని తెల్లవారి 10:59 నిమిషాలకు పాఠశాల యాజమాన్యం తమకు సమాచారం ఇచ్చిందని విద్యార్థి తండ్రి నెల్లూరు రవి కుమార్ చెప్పారు. వెంటనే గాయత్రి ఆసుపత్రికి తరలిస్తున్నం కొన ఊపిరి ఉంది అని యాజమాన్యం ఫోన్ లో చెప్పిందని తండ్రి తెలిపారు. ఘటనకు సంబంధించి పాఠశాల యాజమాన్యం ఎటువంటి ఫోటోలు కూడా చూపించలేదని అన్నారు.
ALSO READ :- పాకిస్థాన్‌లో బాంబు పేలుళ్లు.. 25 మంది మృతి
తల్లి తండ్రులు లేకుండా ఎలా బాడీని తరలిస్తారని ప్రశ్నించారు. 47 నిమిషాలు రూంలోనే ఉంచారు తప్ప ఎవ్వరికీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదని అన్నారు. తమ కుమారుడిని కళాశాల యాజమాన్యం చంపేశారని ఆరోపించారు. ఉరి వేసుకుంటే రూంలో బ్లడ్ ఎలా వస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల తమకు న్యాయం చేయాలని కోరారు.