హైదరాబాద్: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట్లో గల శ్రీ చైతన్య బాయ్స్ ఎలైట్ క్యాంపస్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి ప్రాంతానికి చెందిన జశ్వంత్ గౌడ్ తన హాస్టల్ గదిలో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఉరి తొలిగించి ఆస్పత్రికి తీసుకెళ్ళినప్పటికీ, లాభం లేకోపోయింది. అప్పటికీ, విద్యార్థి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
కళాశాల యాజమాన్యం విద్యార్థి ఆత్మహత్య విషయాన్ని మృతుని తల్లిదండ్రులకు చేరవేసింది. విద్యార్థి ఎందుకు ప్రాణాలు తీసుకోవాల్సి వచ్చింది..? అనే వివరాలు తెలియడం లేదు. ఈ ఘటనపై తోటి విద్యార్థులు సైతం నోరు మెదపడం లేదు. చదువు ఒత్తిడితో ప్రాణాలు తీసుకున్నాడా..? లేదా మరేదైనా కారణం ఉందా..! అనే వివరాలు తెలియాల్సి ఉంది.