Good News : పాఠశాలల్లో పిల్లలకు కూరగాయల సాగుపై ఉచితంగా శిక్షణ

Good News : పాఠశాలల్లో పిల్లలకు కూరగాయల సాగుపై ఉచితంగా శిక్షణ

బీహార్​లో విద్యాశాఖ ఓ గుడ్​ న్యూస్​ చెప్పింది . పిల్లలకు చదువుతో పాటు కూరగాయల సాగు.. తోటపని మొదలగు వ్యవసాయ సంబంధ విషయాల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. పాట్నా జిల్లాలోని565 పాఠశాలల్లో క్యాబేజి, పెసలు ఇంకా చాలారకాలలైన కూరగాయల సాగు విషయంలో ఎప్పుడు..విత్తనం వేయాలి..నీటి పారుదల ఎలా ఉండాలి..ఎన్నిరోజులకు దిగుబడి వస్తుంది అనే విషయాల గురించి శిక్షణ ఇస్తున్నారు.

పాఠశాల పిల్లలు బీహార్‌లో కూరగాయలు పండించడంలో మెలకువలు నేర్చుకుంటారు, ప్రభుత్వం ఉచిత శిక్షణ ఇస్తుంది.   పాట్నా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు చదువుతో పాటు తోట పనిలో మెళకువలపై శిక్షణ ఇవ్వనున్నారు. న్యూట్రిషన్ గార్డెన్‌ను సిద్ధం చేయాలని 565 పాఠశాల ప్రధానోపాద్యాయులకు  జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాలు జారీ చేశారు.  పాఠశాలలోమధ్యాహ్నభోజన పథకంలో పిల్లలు పండించిన కూరగాయలను వినియోగించనున్నారు.

 సేంద్రీయ వ్యవసాయం చేసేందుకు నీటి వసతి ఉన్న  ప్రభుత్వ పాఠశాలలను కూరగాయలను పండించేందుకు ఎంపికచేశారు. కొన్ని పాఠశాలల్లో  పైకప్పుపై, బకెట్లు, ప్లాస్టిక్ బాటిళ్లు, కుండీల్లో మొక్కలు పెంచేలా శిక్షణ ఇచ్చి...  మొక్కల పెంపకంపై సమాచారం అందించేందుకు వర్క్‌షాప్ నిర్వహించనున్నారు.  పోషణ వాటికలో తక్కువ స్థలంలో పండించే కూరగాయల జాబితాను కూడా సిద్ధం చేశారు. ఇందులో బచ్చలికూర, ముల్లంగి, కొత్తిమీర, మెంతులు, టమోటా, మిరపకాయ, క్యారెట్ మరియు పుదీనా ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో అత్యధిక సంఖ్యలో మొక్కలు నాటాలని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించారు. అదే సమయంలో, తగినంత స్థలం ఉన్న పాఠశాలల్లో, తోటలలో క్యాబేజీ, పెసలు మరియు ఇతర సీజనల్ కూరగాయల సాగు మరియు నీటిపారుదల గురించి పిల్లలకు సమాచారం ఇవ్వబడుతుంది.

కూరగాయల పోషకాహారం, వాటిలో ఉండే పోషకాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సెమినార్లు నిర్వహిస్తారు.  ఏ సీజన్‌లో ఎలాంటి కూరగాయలు పండించాలి. ఏఏ కూరగాయల్లో ఎలాంటి పోషకాలున్నాయో వివరాలు చెబుతున్నారు.  విద్యార్థి స్థాయి నుంచే పిల్లలకు వ్యవసాయం..కూరగాయల పెంపకం..వంటి విషయాల్లో అవగాహన కల్పించేందుకే ఇలాంటి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పాట్నాజిల్లా డీఈవో తెలిపారు.