డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్‌ ముట్టడికి స్టూడెంట్ల యత్నం

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా కేంద్రమైన భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సోమవారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి క్యాంప్​ఆఫీస్‌ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీగా క్యాంప్‌ ఆఫీసు వైపు వెళ్తుండగా మధ్యలోనే ఆపేశారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం స్టేట్​ వైస్​ ప్రెసిడెంట్​ పల్లగొర్ల మోదీరాందేవ్ మాట్లాడుతూ డిగ్రి కాలేజీ కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న స్టూడెంట్లను అడ్డుకోవడం సరికాదన్నారు. 

Also Read : - కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ ​చేయాలి

కాలేజీ ఏర్పాటు చేయకుంటే కలెక్టరేట్​ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ లీడర్​ బట్టు రాంచంద్రయ్య, స్టూడెంట్స్​ లీడర్లు తుమ్మేటి మహేశ్, బిల్లా సంతోష్ కుమార్, బాలాజీ నాయక్, దత్తు నాయక్, వైష్ణవి, శిరీష గౌడ్, కే స్వప్న, మానస, రమాదేవి, కే ఝాన్సీ, జె సురేఖ ఉన్నారు