- బెల్లంపల్లిలో వేయి మంది విద్యార్థుల ర్యాలీ
బెల్లంపల్లి, వెలుగు: పెండింగ్‌లో ఉన్న స్కాలర్ షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బెల్లంపల్లిలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలో దాదాపు వేయి మంది విద్యార్థు లతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐఎఫ్‌డీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సబ్బని రాజేంద్ర ప్రసాద్, ఏఐఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు అల్లి సాగర్, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దీపక్ కుమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు శ్రీకాంత్ మాట్లాడారు.
గత సర్కారు చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం పునరావృతం చేయొద్దన్నారు. దాదాపు రూ.7 వేల కోట్ల స్కాలర్ షిప్‌లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యాశాఖ మంత్రిని నియమించాలన్నారు. ఏఐఎఫ్‌డీవై జిల్లా కార్యదర్శి పసులేటి వెంకటేశ్, ఎన్ సీపీ జిల్లా అధ్యక్షుడు మద్దెర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.