హైదరాబాద్ లో నీట్ ఆందోళనలు.. రాజ్ భవన్ ను ముట్టడికి ప్రయత్నం

హైదరాబాద్ లో నీట్ ఆందోళనలు.. రాజ్ భవన్ ను ముట్టడికి ప్రయత్నం

నీట్ పరీక్ష అవకతవకలపై హైదరాబాద్ సిటీలో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన క్రమంలో భారీగా విద్యార్థి సంఘాలు జూలై 1వ తేదీ సోమవారం రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ.. నెక్లెస్ రోడ్డు నుంచి రాజ్ భవన్ కు ర్యాలీగా వెళ్తుండగా..  ఇందిరా గాంధీ విగ్రహం దగ్గర విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. 

ఈ క్రమంలో విద్యార్థులు, పోలీసులకు వాగ్వాదం, తోపులాటు చోటుచుసుకుంది. అధిక సంఖ్యలో విద్యార్థులు తరలి రావడంతో నెక్లెస్ రోడ్డులో భారీగా పోలీసులు మోహరించారు. విద్యార్థులను అదుపలోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. ఎన్టీఏ ను కూడా రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.