టీయూలో స్టూడెంట్​ యూనియన్ల ఆందోళన..రిజైన్​ చేయాలని డిమాండ్

డిచ్​పల్లి, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీ లో   మంగళవారం విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.  పీడీఎస్​యూ, ఎన్​ఎస్​యూఐ, బీవీఎం, ఎస్ఎఫ్​ఐ సంఘాల లీడర్లు, స్టూడెంట్లు వీసీ ఛాంబర్​ను ముట్టడించారు.  ఈసీ, వీసీ ఇష్టానుసారంగా రిజిస్ట్రార్ల ను నియమిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వర్సిటీ కి ఇద్దరు రిజిస్ట్రార్లను నియమించడం సిగ్గుచేటని అన్నారు.  వీసీ రిజైన్​ చేసి వెళ్లిపోవాలని, అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే వీసీ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. 

ఉద్రిక్తత పరిస్తితులు నెలకొనడంతో   పోలీసులు వారిని బయటకు పంపించారు. లీడర్లు రాజేశ్వర్​, వేణురాజ్​, విఠల్​,  సంతోష్​, స్నేహిత, నిఖిల్​ రెడ్డి, సయ్యద్​ అహ్మద్​, సందీప్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.