ఖమ్మం పట్టణం ఎన్టీఆర్ సర్కిల్ లో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో ప్రమాదం జరిగింది. మూడో అంతస్థు నుంచి 10వ తరగతి విద్యార్థిని సాయి శరణ్య కిందపడిపోయింది. బాలికకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
ప్రమాద ఘటన తెలుసుకున్న విద్యార్థి సంఘాలు...స్కూల్ వద్ద ఆందోళనకు దిగాయి. స్కూల్ బిల్డింగ్ లోకి దూసుకెళ్లి ఫర్నీచర్, ఇతర సామాగ్రిని ధ్వంసం చేశాయి. ప్రమాదానికి యాజమాన్యమే కారణమని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది ఆత్మహత్యా..లేక ప్రమాదమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నాయి.