
దహెగాం, వెలుగు: తండ్రి చనిపోయిన బాధను దిగమింగి ఓ విద్యార్థిని పదో తరగతి పరీక్ష రాసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం మండలంలోని చౌక గ్రామానికి చెందిన మేకల రాజన్న అనారోగ్యంతో మంగళవారం రాత్రి చనిపోయాడు. రాజన్న కూతురు అనురాధ దహెగాం కేజీబీవీలో టెన్త్ చదువుతోంది.
తండ్రి చనిపోయిన విషయం తెలిసినా బాధను దిగమింగి బుధవారం మ్యాథ్స్ ఎగ్జామ్ రాసింది. అనంతరం గ్రామంలో జరిగిన తండ్రి అంత్యక్రియలకు హాజరైంది.