హైకోర్టు చీఫ్​ జస్టిస్​కు పోస్ట్​ కార్డులు పంపిన స్టూడెంట్స్

హైకోర్టు చీఫ్​ జస్టిస్​కు పోస్ట్​ కార్డులు పంపిన స్టూడెంట్స్

మహబూబాబాద్ : టీచర్ల బదిలీల్లో అన్యాయం జరుగుతోందంటూ రాష్ట్రవ్యాప్తంగా భాషా పండితుల ఆందోళన కొనసాగుతోంది. ఈ నెల 1వ తేదీ నుంచి వారు  విద్యాబోధన నిలిపివేయడంతో 9, 10 తరగతుల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భాషా పండితుల జాబ్ చార్ట్ ప్రకారం 6, 7, 8 తరగతులకు మాత్రమే బోధిస్తున్నారు. ఈ  క్రమంలో మహబూబాబాద్ జిల్లా కంఠాయపాలెం ఉన్నత పాఠశాల విద్యార్థులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పోస్టు కార్డుల ద్వారా తమ విన్నపాన్ని తెలిపారు. కోర్టు కేసు సాకుగా చూపి ప్రభుత్వం భాషా పండితులకు ప్రమోషన్లలో అవకాశం ఇవ్వకపోవడంతో వారు 15 రోజులుగా తమకు చదువు చెప్పడం లేదన్న విషయాన్ని అందులో ప్రస్తావించారు. వార్షిక పరీక్షలకు సమయం దగ్గరపడుతున్న సమయంలో టీచర్ల సహాయ నిరాకరణ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. కేసును త్వరగా పరిష్కరించి విద్యా బోధన సక్రమంగా జరిగేలా చూడాలని హైకోర్టు సీజేకు పోస్టు కార్డులు పంపారు.