టీచర్లను నియమించాలని స్కూల్ కు తాళం

టీచర్లను నియమించాలని స్కూల్ కు తాళం
  • జోగుళాంబ గద్వాల జిల్లాలో స్టూడెంట్స్, పేరెంట్స్ ఆందోళన

గద్వాల, వెలుగు : టీచర్ల నియమించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు..తల్లిదండ్రులు స్కూల్ కు తాళం వేసి ధర్నాకు దిగారు. జోగు ళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆరగిద్ద సీపీఎస్ స్కూల్ లో 306 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇద్దరు మాత్రమే టీచర్లు ఉండటంతో బోధన సరిగా సాగడం లేదని సోమవారం స్కూల్ కు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. సరిపడా టీచర్లు లేకపోవడంతో తమ పిల్లలు ఎలా చదువుకోవాలని తల్లిదండ్రులు ఫోనులోఎంఈఓ తో మాట్లాడారు.  దసరా సెలవులు తర్వాత నలుగురు విద్యా వలంటీర్లను నియమిస్తామని హామీ ఇవ్వడంతో విరమించారు. 

విద్యార్థి సంఘ నేతలు కూడా మద్దతు తెలిపారు. ధర్నాలో గ్రామస్తులు వీరేశ్, దేవేంద్ర, సుదర్శన్, సిద్దు, అంజి, శ్రీహరి, రామ్, అయ్యప్ప, మహిబు తదితరులు ఉన్నారు. అదేవిధంగా రాజోలి జడ్పీహెచ్ ఎస్ స్కూల్ లోని సమస్యలు పరిష్కరించాలని వెళ్లి కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. స్కూల్లో 550 మంది స్టూడెంట్స్ ఉండగా.. 5 టాయిలెట్స్ మాత్రమే ఉన్నాయన్నారు.  టీచర్ల కొరత, స్కూల్ కు కరెంటు లేకపోవడం వంటి తదితర సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ను కోరారు.