అన్నపురెడ్డిపల్లి, వెలుగు: మండల పరిధిలోని ఎర్రగుంట జడ్పీ పాఠశాలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు గురువారం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించారు.
ఇస్రో డైరెక్టర్ అనుమతితో పాఠశాలకు చెందిన 24 మంది విద్యార్థులు, ఎనిమిది మంది ఉపాధ్యాయులు, అక్కడికి వెళ్లారు. ఉపగ్రహాల ప్రయోగ లాంచ్ ప్యాడ్లను, మాస్టర్ కంట్రోల్ సెంటర్, ఇస్రో మ్యూజియాన్ని సందర్శించారు. ప్రధానోపాధ్యాయులు ఆనంద్ కుమార్, డీఈవో వెంకటేశ్వర చారి, విద్యార్థులను అభినందించారు.