ఖమ్మం జిల్లా ముదిగొండలోని మిట్టగూడెం పాఠశాలలో తమకు విద్యాబుద్ధులు నేర్పించిన టీచర్లకు విద్యార్థులు పాలాభిషేకం చేశారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీలు, పదోన్నతుల్లో భాగంగా టీచర్లు వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు.
దీంతో తమకు చదువుతో పాటు విద్యాబుద్ధులు నేర్పించిన సురేష్ తో పాటు మరో ఇద్దరు టీచర్లకు విద్యార్థులకు పాలాభిషేకం చేశారు. తమను వదిలి వెళ్తుండటంతో భావోద్వేగానికి గురయ్యారు. విద్యార్థులు పైచదువులు చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని టీచర్స్ కోరుతూ విద్యార్థులను దీవించారు.