నోటాకు ఓటెయ్యండి..మునుగోడులో విద్యార్థుల ప్రచారం

నోటాకు ఓటెయ్యండి..మునుగోడులో విద్యార్థుల ప్రచారం

మునుగోడు ఉప ఎన్నికల్లో నోటాకు ఓటేయ్యాలని విద్యార్థులు ప్రచారం చేస్తున్నారు . నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. నోటాకు ఓటు వేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయో విద్యార్థులు అవగాహన కల్పిస్తున్నారు. నోటాకు లక్ష ఓట్లు వస్తే 2 వేల 5 వందల కోట్లతో అభివృద్ధి చేస్తారంటూ ప్రచారం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు ఇచ్చే మోసపూరిత హామీలను నమ్మొద్దంటూ ప్రచారం చేస్తున్నారు. 

మునుగోడులో పార్టీలు హోరాహోరీ ప్రచారం చేస్తున్నాయి. గెలుపు కోసం నువ్వా నేనా అన్నట్లు ప్రచారం చేస్తున్నారు.  టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి బరిలో ఉన్నారు. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా మునుగోడులోనే తిష్ట వేసి ప్రచారం చేస్తున్నారు.