![మోడల్ స్కూల్ పిల్లలకు అగచాట్లు.. ఒక్కో బడిలో 100 మంది గర్ల్స్ కు మాత్రమే హాస్టల్ వసతి](https://static.v6velugu.com/uploads/2023/07/Students-are-facing-difficulties-in-Telangana-Model-School_piAcfjHrnB.jpg)
- మిగిలిన 600 – 700 మంది డెయిలీ ఇండ్లకు పోయి రావాల్సిందే
- రాష్ట్రంలో194 మోడల్ స్కూళ్లు
- ప్రతీది ఊరికి 2–3 కిలోమీటర్ల దూరం
- సరైన రోడ్లు, ట్రాన్స్ పోర్టేషన్ లేక నానా ఇబ్బందులు
- హాస్టల్ వసతి పెంచాలని తల్లిదండ్రుల డిమాండ్
మంచిర్యాల/బజార్ హత్నూర్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్స్కూళ్లలో హాస్టల్ వసతి పెంచకపోవడంతో స్టూడెంట్లు నానా అగచాట్లు పడుతున్నారు. 10 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే స్కూళ్లకు డెయిలీ వచ్చి, వెళ్లాలంటే చాలా కష్టంగా ఉంటోందని చెబుతున్నారు. 600 నుంచి 800 మంది స్ట్రెంత్ఉంటున్న స్కూళ్లలో ప్రభుత్వం కేవలం 100 మందికి మాత్రమే హాస్టల్వసతి కల్పిస్తుండడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెజారిటీ స్టూడెంట్లు ఇండ్ల నుంచి రాకపోకలు సాగించడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో స్టూడెంట్నెలకు వెయ్యి రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. స్కూళ్లన్నీ ఊళ్లకు దూరంగా.. సరైన రోడ్డు కూడా లేని ప్రదేశాల్లో ఉన్నాయని, ప్రభుత్వం స్పందించి హాస్టళ్లలో సీట్ల సంఖ్య పెంచాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
అంతా పేదవారే
పేద స్టూడెంట్లకు మెరుగైన విద్యను అందించేందుకు ఉమ్మడి రాష్ట్రంలోని అప్పటి కాంగ్రెస్ప్రభుత్వం మోడల్‌స్కూళ్లను ఏర్పాటు చేసి, ఇంగ్లిష్మీడియంను ప్రవేశపెట్టింది. మొదట్లో ఆరు నుంచి పదో తరగతి వరకు మాత్రమే ఉండగా, దశలవారీగా ఇంటర్మీడియెట్ వరకు అప్ గ్రేడ్ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 194 మోడల్‌స్కూళ్లు నడుస్తున్నాయి. ఒక్కో స్కూలులో ఆరు నుంచి పదో తరగతి వరకు 500 మంది స్టూడెంట్లు ఉన్నారు. ఇంటర్లో ఒక్కో గ్రూపులో 40 మంది చొప్పున ఫస్ట్ఇయర్, సెకండ్ఇయర్లో నాలుగు గ్రూపుల్లో 320 మంది చదువుకుంటున్నారు. ప్రభుత్వం 2012లో మోడల్ స్కూళ్లలో హాస్టళ్లను ఏర్పాటు చేసినప్పటికీ కేవలం వంద సీట్లనే కేటాయించింది. వాటిలో కొందరు ఇంటర్బాలికలకు మాత్రమే అడ్మిషన్లు కల్పిస్తోంది. కొన్ని స్కూళ్లలో హాస్టల్బిల్డింగుల నిర్మాణాలు నేటికీ పూర్తి కాలేదు.
పోకిరీల వేధింపులు
మోడల్ స్కూళ్లలో చదువుకుంటున్న పిల్లలంతా పేదవారే. దూరప్రాంతాల నుంచి స్కూలుకు వచ్చిపోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. హాస్టళ్లలో సీట్ల సంఖ్య పెంచాలని తల్లిదండ్రులు ఏండ్లుగా కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒక్కోచోట 320 మంది ఇంటర్ఫస్ట్, సెకండ్ఇయర్చదువుతుండగా కేవలం 100 మంది బాలికలకు మాత్రమే హాస్టల్అడ్మిషన్ఇస్తున్నారు. మిగిలినవారంతా డెయిలీ ఇండ్లకు వెళ్లిరావాల్సిందే. వెల్ఫేర్ హాస్టళ్లలోనూ లిమిటెడ్ సీట్లు ఉండటంతో పేద స్టూడెంట్లకు నిరాశ తప్పడం లేదు. స్కూలుకు వెళ్లి, వచ్చే టైంలో అమ్మాయిలను దారిలో పోకిరీలు వేధించిన ఘటనలు ఉన్నాయి.
ఊరికి అల్లంత దూరాన..
మంచిర్యాల జిల్లా దండేపల్లి, మందమర్రి, కాసిపేట, కోటపల్లి, మంచిర్యాల మండలాల్లో మొత్తం ఐదు మోడల్ స్కూళ్లు ఉన్నాయి. అన్నీ ఊరికి దూరంగానే ఉన్నాయి. మంచిర్యాల రాజీవ్నగర్మోడల్ స్కూల్ అయితే బస్టాండ్ నుంచి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి సరైన రోడ్డు కూడా లేదు. స్టూడెంట్లు హమాలివాడ, గోపాల్‌వాడ మీదుగా తిరిగి వెళ్లాల్సి వస్తోంది. స్థానిక బస్టాండ్ నుంచి స్పెషల్ బస్ నడుపుతున్నప్పటికీ రోజూ టైమ్‌వేస్ట్ అవుతోందని స్టూడెంట్లు వాపోతున్నారు.
బస్ సౌకర్యం లేనివాళ్లు ప్రైవేట్వెహికల్స్లో స్కూలుకు వెళ్తున్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు ఖర్చువుతోందని చెబుతున్నారు. దండేపల్లి మండలంలోని లింగాపూర్గ్రామానికి కిలోమీటరు దూరంలో ప్రభుత్వం మోడల్స్కూలును ఏర్పాటు చేసింది. ఇక్కడ దండేపల్లితోపాటు జన్నారం, లక్సెట్టిపేట మండలాల స్టూడెంట్లు చదువుకుంటున్నారు. బిల్డింగ్ నిర్మాణం పూర్తికాకపోవడంతో నేటికీ హాస్టల్‌ను ప్రారంభించలేదు. కోటపల్లి మోడల్స్కూలులో చెన్నూరు, వేమనపల్లి మండలాల స్టూడెంట్లు చదువుకుంటున్నారు. డెయిలీ 20 కిలోమీటర్లు వెళ్లి రావడానికి నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ప్రభుత్వం బస్‌పాస్‌లు ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ ఇంటి నుంచి బస్టాండుకు రావడానికి, మెయిన్ రోడ్డు నుంచి స్కూళ్లకు వెళ్లడానికి ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోందని స్టూడెంట్లు
వాపోతున్నారు.
‘‘ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల కేంద్రంలోని గవర్నమెంట్ మోడల్ స్కూల్లో 6 నుంచి 12వ తరగతి వరకు 800 మంది స్టూడెంట్లు చదువుకుంటున్నారు. కొందరికి హాస్టల్ సౌకర్యం ఉండగా, మిగిలినవారంతా డైలీ ఇండ్లకు వెళ్లి వస్తున్నారు. స్థానిక బీటీ రోడ్డు నుంచి స్కూల్ కిలోమీటరు దూరంలో ఉండగా, వర్షం పడితే ఆ దారంతా బురదమయం అవుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు చిత్తడిగా మారింది. గుంతల్లో నీళ్లు నిలిచి వెహికల్స్ దిగబడుతున్నాయి.’’