రూములున్నా స్టూడెంట్లకిస్తలే..

  •     కేయూలో రెండు బిల్డింగ్‌‌‌‌లు నిర్మించి ఓపెన్‌‌‌‌ చేయని ఆఫీసర్లు
  •     రూమ్స్‌‌‌‌ సరిపోక ఇబ్బందులు పడుతున్న స్టూడెంట్స్‌‌‌‌
  •     నాన్‌‌‌‌ బోర్డర్ల ఏరివేత పేరుతో ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీ స్టూడెంట్లకు ఇబ్బందులు
  •     వర్సిటీ మెయిన్‌‌‌‌ గేట్‌‌‌‌ ఎదుట విద్యార్థుల ఆందోళన

హనుమకొండ, వెలుగు : కాకతీయ యూనివర్సిటీలో హాస్టళ్లు సరిపోక స్టూడెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్యాంపస్‌‌‌‌లో రెండు బిల్డింగ్‌‌‌‌లు ఖాళీగా ఉన్నా వాటిని ఓపెన్‌‌‌‌ చేయకుండా, స్టూడెంట్లకు రూమ్స్‌‌‌‌ కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఖాళీగా ఉన్న హాస్టల్‌‌‌‌ రూమ్స్‌‌‌‌లో ఉంటున్న వారిని సైతం బయటికి పంపుతూ తాళాలు వేస్తుండడంతో స్టూడెంట్లు ఆందోళన బాటపడుతున్నారు. తమకు రూమ్స్‌‌‌‌ కేటాయించాలంటూ సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సు (ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీ) స్టూడెంట్లు మంగళవారం రాత్రి యూనివర్సిటీ గేట్‌‌‌‌ ఎదుట ధర్నా నిర్వహించి రోడ్డుపైనే భోజనాలు చేశారు. రెండేండ్ల నుంచి సమస్య తీవ్రం అవుతున్నా వర్సిటీ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. 

ఒక్కో రూంలో పది మంది 

కాకతీయ యూనివర్సిటీలో హాస్టళ్ల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. వర్సిటీలో కొత్తగా కట్టిన వాటితో కలిపి మొత్తం 15 హాస్టల్స్, సుమారు 990 రూమ్స్‌‌‌‌ ఉండగా సుమారు 3,866 మంది స్టూడెంట్లకు వసతి కల్పించే చాన్స్‌‌‌‌ ఉంది. కానీ హాస్టల్‌‌‌‌ వసతి తీసుకుంటున్న స్టూడెంట్ల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. దీనికి తోడు నాన్‌‌‌‌ బోర్డర్స్‌‌‌‌ కూడా జతవుతుండడంతో ఒక్కో రూమ్‌‌‌‌లో ఐదు నుంచి 10 మంది వరకు స్టూడెంట్లు ఉంటున్నారు. ఈ సమస్య అమ్మాయిలకే ఎక్కువగా ఎదురవుతోంది. అమ్మాయిల కోసం క్యాంపస్‌‌‌‌లో పద్మాక్షి హాస్టల్‌‌‌‌లోని ఏ, బీ, సీ, డీ బ్లాకులతో పాటు, కొత్తగా నిర్మించిన సావిత్రీబాయి పూలే హాస్టల్‌‌‌‌లో కలిపి మొత్తం 236 రూములు ఉండగా వీటి కెపాసిటీ 1,262 మాత్రమే. కానీ ఇందులో 1,800లకు పైగా స్టూడెంట్లు ఉంటున్నారు. పది మంది ఉంటున్న రూమ్స్‌‌‌‌ కూడా ఉన్నాయని స్టూడెంట్లు వాపోతున్నారు.

బిల్డింగ్‌‌‌‌లు ఖాళీగా ఉన్నా స్టూడెంట్లకిస్తలేరు

యూనివర్సిటీలో సుమారు 69 కోర్సులు అందిస్తుండగా నాలుగు వేల మందికిపైగా క్యాంపస్‌‌‌‌ హాస్టల్‌‌‌‌ కోసం మెస్‌‌‌‌ కార్డులు తీసుకుంటున్నారు. బీఎడ్, బీపీఎడ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంసీజే, ఎంహెర్‌‌‌‌ఆర్‌‌‌‌ఎం వంటి సెల్ఫ్​ఫైనాన్స్‌‌‌‌ కోర్సులకు విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇందులో అమ్మాయిలే ఎక్కువగా ఉండడంతో వారికి హాస్టళ్లు సరిపోవడం లేదు. దీంతో అబ్బాయిలు ఉంటున్న పోతన హాస్టల్‌‌‌‌ను ఖాళీ చేయించారు. దానిని అమ్మాయిలకు కేటాయించే ఉద్దేశంతో బిల్డింగ్‌‌‌‌కు రిపేర్లు చేయించి, కాంపౌండ్‌‌‌‌ వాల్స్‌‌‌‌, ఫెన్సింగ్‌‌‌‌ ఏర్పాటు చేశారు. దీనికి తోడు పద్మాక్షి హాస్టల్‌‌‌‌ ఎదురుగా కొత్తగా మరో బిల్డింగ్‌‌‌‌ కట్టారు. ఈ రెండు బిల్డింగ్‌‌‌‌లతో పాటు, సావిత్రిబాయి పూలే హాస్టల్‌‌‌‌ సగం వరకు ఖాళీగానే ఉంది. అయినా వీటిని వినియోగంలోకి తీసుకురాకుండా వర్సిటీ ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఖాళీగా ఉన్న హాస్టళ్లను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీ స్టూడెంట్లకు హాస్టల్‌‌‌‌ ఫెసిలిటీ కల్పించొచ్చు. కానీ ఆఫీసర్లు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. 

ఫండ్స్‌‌‌‌ కేటాయించినా పనులు మొదలైతలే...

కాకతీయ యూనివర్సిటీలో హాస్టళ్ల కొరత కారణంగా రెండు కొత్త బిల్డింగ్‌‌‌‌ల నిర్మాణానికి ఆఫీసర్లు ప్రపోజల్స్‌‌‌‌ పంపించారు. ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన మహిళా దినోత్సవ సంబరాలకు వచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్‌‌‌‌ రెండు బిల్డింగుల కోసం రూ. 20 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఇంతవరకు వాటి ఊసే లేకుండా పోయింది.
ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీ కోర్సులకు హాస్టల్‌‌‌‌ కేటాయించకపోవడంతో రెండేండ్ల నుంచి స్టూడెంట్లు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా ఎన్నో సార్లు వర్సిటీ ఉన్నతాధికారులకు సమస్యను వివరించడంతో పాటు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు, కలెక్టర్‌‌‌‌కు వినతిపత్రాలు అందజేశారు. అయినా క్యాంపస్‌‌‌‌ హాస్టళ్లలో ఉంటున్న నాన్‌‌‌‌ బోర్డర్స్‌‌‌‌ను పంపించే ఉద్దేశంతో ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీ స్టూడెంట్లను ఇబ్బంది పెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీ స్టూడెంట్లు హాస్టల్స్‌‌‌‌ ఖాళీ చేయాలని ఆదేశించడం, రూమ్స్‌‌‌‌కు తాళాలు వేయిస్తుండడంతో అమ్మాయిలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల కింద రూమ్స్‌‌‌‌కు తాళాలు వేయడంతో స్టూడెంట్లు, విద్యార్థి సంఘాల లీడర్లు ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగిన ప్రతీసారి ఆఫీసర్లు హామీ ఇచ్చి తర్వాత పట్టించుకోకపోవడం ఆనవాయితీగా మారింది. 

కేయూ స్టూడెంట్ల ఆందోళన తాత్కాలిక వాయిదా 

హాస్టల్‌‌‌‌ వసతి కల్పించాలంటూ కేయూ ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీ స్టూడెంట్స్‌‌‌‌ చేపట్టిన ఆందోళన తాత్కాలికంగా వాయిదా పడింది. మంగళవారం సాయంత్రం చేపట్టిన నిరసన బుధవారం కూడా కొనసాగగా, విద్యార్థులంతా కేయూ ఫస్ట్​గేట్‌‌‌‌ ఎదుట బైఠాయించి కబడ్డీ, ఖోఖో ఆడుతూ నిరసన తెలిపారు. దీంతో హాస్టల్స్​డైరెక్టర్​వెంకయ్య స్టూడెంట్లతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికే చాలా సార్లు ఇలా చెప్పి మళ్లీ పట్టించుకోలేదని ఈ సారి లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని స్టూడెంట్లు డిమాండ్​ చేశారు. దీంతో కొద్దిసేపు విద్యార్థులతో మాట్లాడిన ఆఫీసర్లు ఈ సారి సమస్య పరిష్కారానికి తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో స్టూడెంట్లు ఆందోళన విరమించారు.

విద్యార్థులను గోస పెడుతున్రు 

చదువుకుందామని వచ్చిన స్టూడెంట్లను వర్సిటీ పెద్దలు ఇబ్బందులు పెడుతున్నారు. అడ్మిషన్ తీసుకున్న ప్రతి స్టూడెంట్‌‌‌‌కు హాస్టల్‌‌‌‌ వసతి కల్పించాలి. కానీ ఇక్కడి ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. ఖాళీగా ఉన్న హాస్టల్‌‌‌‌ బిల్డింగులను అమ్మాయిలకు కేటాయిస్తే ఇబ్బందే ఉండేది కాదు. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించాలి.

- బొట్ల మనోహర్‌‌‌‌, విద్యార్థి సంఘం నేత

15 రోజుల్లో సాల్వ్​ చేస్తం 

క్యాంపస్‌‌‌‌ హాస్టళ్ల నుంచి నాన్‌‌‌‌ బోర్డర్లను బయటకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆ తర్వాత అందరికీ మెస్‌‌‌‌ కార్డులు జారీ చేసి హాస్టల్‌‌‌‌ వసతి కల్పిస్తాం. 15 రోజుల్లో సమస్యను సాల్వ్​చేస్తాం. ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీ స్టూడెంట్లకు వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం.

- డాక్టర్‌‌‌‌ వెంకయ్య, హాస్టల్స్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌, కేయూ