పట్టించుకోని అధికారులు.. గుంతలను పూడుస్తున్న విద్యార్థులు

జగిత్యాల జిల్లాలో విద్యార్థులు రోడ్డుపై ఉన్న గుంతలను పూడుస్తున్నారు. వెల్గటూర్ పట్టణంలో రోడ్డు అధ్వానంగా మారాయని.. ఈ రోడ్లపై ప్రయాణం చేయాలంటే ఇబ్బందులు పడుతున్నామని.. మోడల్ స్కూల్  విద్యార్థులు రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చారు. ఈ గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. విద్యార్థులు స్కూల్ కి వెళ్లేటప్పుడు తమ బ్యాగ్ లు ఆటోలో నుంచి కిందపడుతున్నాయని.. దానివల్ల తామంతా రోడ్డుపై ఆటో దిగి మళ్లీ బ్యాగ్ లను ఆటోలో పెట్టుకోవాల్సి వస్తోందని చెప్పారు.

అధికారులు పట్టించుకోకపోవడం వల్లే రోడ్లు ఈ స్థితికి వచ్చాయని.. కనీసం ఇప్పుడైనా అధికారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.