మెస్​చార్జీల పెంపుపై హర్షం

మెస్​చార్జీల పెంపుపై హర్షం

ములుగు/ ఎల్కతుర్తి, వెలుగు: రాష్ర్ట ప్రభుత్వం డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచడంపై గిరిజన, సాంఘిక సంక్షేమ గురుకులాలు, హాస్టళ్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం ములుగు మండలం ఇంచర్ల ఎస్టీ గురుకులంలో ప్రిన్సిపల్ ఎ.ఝాన్సీ రాణి, వైస్ ప్రిన్సిపల్స్ మమత, కె.సంజయ్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి ప్లకార్డులతో ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ వీడియో సందేశాన్ని పంపించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి జిల్లా పరిషత్​ఉన్నత పాఠశాల, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు సీఎం రేవంత్​రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్​కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు కాంగ్రెస్​మండలాధ్యక్షుడు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పీసీసీ సభ్యులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు సంతాజీ, సింగిల్ విండో డైరెక్టర్ మహేందర్, ప్రధాన కార్యదర్శి మహేందర్, యూత్ మాజీ అధ్యక్షుడు స్వామి, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నాకర్ తదితరులు పండ్లు పంపిణీ చేశారు.