హాలియా, వెలుగు: నల్గొండ జిల్లా హాలియాలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో పురుగులన్నం పెడుతున్నారని విద్యార్థులు గురువారం మధ్యాహ్నం హాలియా తహసీల్దార్ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించారు. కొద్ది రోజులుగా ఇదే రిపీట్అవుతుండడంతో భరించలేని విద్యార్థులు అన్నం ప్లేట్లతో తహసీల్దార్ఆఫీసుకు చేరుకుని నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ వారం రోజులుగా మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయని, చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. దీంతో తాము అన్నం తినడం లేదన్నారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణారెడ్డి విద్యార్థులు వద్దకు చేరుకుని వివరాలడిగి తెలుసుకున్నారు.
స్కూల్కు వెళ్లి మధ్యాహ్నం భోజనం వండిన బియ్యాన్ని పరిశీలించగా అందులో పురుగులు కనిపించాయి. దీంతో ఆ బియ్యాన్ని వండొద్దని వాపస్ ఇవ్వాలని స్కూల్ఏజెన్సీని ఆదేశించారు. పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బియ్యానికి పురుగులు పట్టిన మాట వాస్తవమేనని, డిప్యూటీ తహసీల్దార్ ఆదేశాల మేరకు వాటిని తీసుకువెళ్లాలని చెప్పామన్నారు.