ట్రంప్ దెబ్బకు.. ఇతర దేశాల వైపు స్టూడెంట్స్​మొగ్గు..!

ట్రంప్ దెబ్బకు.. ఇతర దేశాల వైపు స్టూడెంట్స్​మొగ్గు..!

అమెరికాలో నిబంధనలు కఠినతరం కావడం, ఫీజులు కూడా భారంగా మారుతుండడంతో విద్యార్థులు జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్​, ఆస్ట్రేలియా, ఐర్లాండ్​ వంటి దేశాలవైపు మొగ్గు చూపుతున్నారు. అమెరికా, బ్రిటన్​, కెనడా వంటి దేశాల్లో రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చయితే..  జర్మనీలో ఏడాదికి కేవలం రూ.లక్షన్నరకు మించి చదువులకు ఖర్చు కావని నిపుణులు చెబుతున్నారు. 

చదువయ్యాక 18 నెలలపాటు వీసా వ్యాలిడ్​ స్టేటస్​లో ఉంటుంది. ఫ్రాన్స్​లో ఖర్చు రూ.2 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఉంటుందని అంటున్నారు. చదువు అనంతరం రెండేండ్ల పాటు వీసా ఉంటుంది. ఇటలీలోనూ చదువుల ఖర్చు రూ.10 లక్షల లోపే ఉంటున్నదని అంటున్నారు. కాగా, 2023లో ఇటలీ, జర్మనీకి వెళ్లిన ఇండియన్ స్టూడెంట్లలో 20% మంది తెలుగు వాళ్లే ఉన్నారు. మరోవైపు ఎంబీబీఎస్‌కు రష్యాకే మొగ్గు చూపుతున్నారు. 

ఫీజులు భారం 

అమెరికాలో ఫీజులు కూడా భారంగా మారుతున్నాయి. గత ఐదేండ్లతో పోలిస్తే అక్కడ చదువుల ఖర్చులు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం  ప్రైవేట్​ వర్సిటీల్లో చదవాలంటే రూ.40 లక్షల దాకా ఖర్చు చేయాల్సి వస్తున్నది. గతంలో రూ.25 లక్షల వరకు ఖర్చయ్యేది. ప్రభుత్వ వర్సిటీల్లో చదివేందుకు రూ.17 లక్షల దాకా ప్రస్తుతం ఖర్చు చేయాల్సిన పరిస్థితులు న్నాయని, గతంలో అందులో సగమే ఉండేదని స్టూడెంట్స్ చెబుతున్నారు. ఇప్పుడు తిండి తిప్పలు, ఇతరత్రా ఖర్చులకూ ఏటా రూ.12 లక్షలు, హెల్త్​ ఇన్సూరెన్స్​కు మరో రూ.లక్షన్నర దాకా ఖర్చు చేయాల్సి వస్తున్నదని అంటున్నారు.