స్టూడెంట్స్​లో నీట్ ​కలవరం

స్టూడెంట్స్​లో నీట్ ​కలవరం
  • రాష్ట్రంలో 47 వేల మంది విద్యార్థుల్లో ఆందోళన
  •     ఎగ్జామ్ ​నిర్వహణ లోపాలతో గందరగోళం
  •     పేపర్ లీక్, మాల్ ప్రాక్టీస్‌‌ జరిగిందని ఆరోపణలు
  •     ఒకే సెంటర్​లో ఎగ్జామ్​ రాసిన ఆరుగురికి సెంట్ పర్సెంట్ రావడంపై అనుమానాలు
  •     ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్, ఇతర పార్టీలు

హైదరాబాద్, వెలుగు : నీట్ ఎగ్జామ్‌‌ నిర్వహణలో జరిగిన లోపాలపై వస్తున్న ఆరోపణలు ఎంబీబీఎస్‌‌ అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ స్టూడెంట్స్‌‌ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పేపర్ లీక్, మాల్ ప్రాక్టీస్‌‌పై ఆరోపణలు, ఒకే సెంటర్​లో ఎగ్జామ్​ రాసిన ఆరుగురికి వంద శాతం రావడంపై తలెత్తుతున్న అనుమానాలతో గందరగోళం చెందుతున్నారు. నీట్ ఎగ్జామ్ నిర్వహణపై కాంగ్రెస్​తోపాటు ఇతర పార్టీల నేతలు ఎంక్వైరీకి డిమాండ్​ చేస్తున్నారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు, సీట్ల సంఖ్య భారీగా పెరగడంతో వేల మంది స్టూడెంట్స్‌‌ మెడికల్ 
ప్రొఫెషన్‌‌ను ఎంచుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో గతంలో కంటే ఎక్కువ మంది ఈసారి నీట్‌‌‌‌‌‌‌‌కు అటెండ్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. ఈ యేడు మొత్తం 77,849 మంది స్టూడెంట్స్​పరీక్ష రాశారు. వీరిలో 47,371 (60.84 శాతం) మంది క్వాలిఫై అయ్యారు. ఇక రేపో, మాపో కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుందని వీరంతా ఆశించారు. కానీ, ఫలితాలు విడుదలైన నాటి నుంచి నీట్‌‌‌‌‌‌‌‌పై ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఇవి పొలిటికల్ టర్న్‌‌‌‌‌‌‌‌ తీసుకున్నాయి. విద్యార్థులకు మద్దతుగా పొలిటికల్ పార్టీలు, నాయకులు ఎంటరయ్యారు. ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌లో అవకతవకలు జరిగాయని, దర్యాప్తు జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. 

పేపర్​లీక్​పై ఆరోపణలు

ఈ ఏడాది మే 5న నీట్ ఎగ్జామ్ జరిగింది. దేశవ్యాప్తంగా 4,750 సెంటర్లలో 23,33,297 మంది పరీక్ష రాశారు. పరీక్ష జరిగిన రోజే నీట్ క్వశ్చన్​ పేపర్ లీక్ అయిందంటూ ఆరోపణలు వచ్చాయి. కానీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌‌‌‌‌‌‌‌టీఏ) దీన్ని ఖండించింది. పేపర్ లీక్ కాలేదని, కొన్ని సెంటర్లలో ఒక పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బదులు మరో పేపర్ ఇచ్చారని, ఎగ్జామ్ ప్రారంభమైన గంట తర్వాత ఆ పేపర్లు ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌లో ప్రత్యక్షమయ్యాయని, ఎగ్జామ్ రాసే విద్యార్థులకు ఆ పేపర్ల గురించి తెలిసే అవకాశమే లేదని వివరణ ఇచ్చింది. ఇదిలా ఉండగా, ఈ నెల 4న నీట్ ఫలితాలను ఎన్‌‌‌‌‌‌‌‌టీఏ విడుదల చేసింది. 13,16,268 మంది విద్యార్థులు  క్వాలిఫై అయినట్టు తెలిపింది. 67 మందికి 720కి 720 మార్కులు వచ్చాయని ప్రకటించింది. వీళ్లందరినీ టాప్ ర్యాంకర్లుగా చూపించింది. అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా 67 మందికి సెంట్ పర్సెంట్ మార్కులు రావడంపై స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ 67 మందిలో ఆరుగురు హర్యానాలోని ఒకే సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎగ్జామ్ రాశారని, వాళ్లంతా ఒకే రూమ్‌‌‌‌‌‌‌‌లో కూర్చొని ఎగ్జామ్ రాశారని ఆరోపణలు వచ్చాయి. ఇలా ఒకే సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాసిన ఆరుగురికి సెంట్ పర్సెంట్ మార్కులు రావడం పట్ల దేశవ్యాప్తంగా స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండే కాదు.. నీట్ పరీక్ష విధానం ప్రకారం సాధ్యం కాని అంశాలు కూడా రిజల్ట్స్​ తర్వాత వెలుగులోకి వచ్చాయి. నీట్‌‌‌‌‌‌‌‌లో 180 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కుల చొప్పున ఇస్తారు. ఒకవేళ తప్పు ఆన్సర్ పెడితే, ఒక మార్కు నెగిటివ్ చేస్తారు. ఈ లెక్కన నీట్‌‌‌‌‌‌‌‌లో వస్తే 720 మార్కులు వచ్చేందుకు అవకాశం ఉంది. కానీ, 716, 717, 718, 719 మార్కులు వచ్చే అవకాశం లేదు. కానీ, ఈసారి చాలా మందికి 718, 719 మార్కులు వచ్చాయి. ఇదేలా సాధ్యం అయిందని స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌టీఏను ప్రశ్నిస్తున్నారు. ఇలా అనేక ఆరోపణలు, వివాదాల నేపథ్యంలో నీట్ పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని డిమాండ్లు వస్తున్నాయి.

టాప్ ర్యాంకులు లేవు

నీట్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌కు ప్రతిసారి టాప్‌‌‌‌‌‌‌‌ టెన్‌‌‌‌‌‌‌‌ లేదా టాప్ 50లో ర్యాంకులు వచ్చేవి. కానీ, ఈ సారి టాప్‌‌‌‌‌‌‌‌ 15లో ఒక్క స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ కూడా లేరు. తెలంగాణ నుంచి అనురన్ ఘోష్ అనే విద్యార్థికి ఆల్ ఇండియా 77 ర్యాంక్ వచ్చింది. ఇతను తప్ప టాప్ 100లో ఒక్కరు కూడా  మన స్టేట్ వాళ్లు లేరు. ఇతను కూడా బెంగాల్‌‌‌‌‌‌‌‌కు చెందిన వ్యక్తి అయినప్పటికీ, నీట్ ప్రిపరేషన్ కోసం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు వచ్చి ఇక్కడి విద్యార్థిగా నీట్‌‌‌‌‌‌‌‌ కోసం నమోదు చేసుకున్నాడు. దీంతో అతడిని తెలంగాణ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌గా ఎన్‌‌‌‌‌‌‌‌టీఏ చూపించింది. లేకుంటే టాప్100లో కూడా తెలంగాణ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ ఒక్కరూ ఉండేవారు కాదు. ఈ ఫలితాలను నీట్ కోచింగ్‌‌‌‌‌‌‌‌కు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను అడ్డాగా చేసిన ఇన్​స్టిట్యూట్లు కూడా తట్టుకోలేకపోతున్నాయి.