చిట్టీలు పెట్టనియ్యలేదని ఇన్విజిలేటర్ ను చితక్కొట్టారు!

చిట్టీలు పెట్టనియ్యలేదని ఇన్విజిలేటర్ ను చితక్కొట్టారు!

వెలుగు: పరీక్షల్లో తాము చిట్టీలు పెట్టకుండా స్ట్రిక్ట్​ చేశారని ఇన్విజిలేటర్​పై స్టూడెంట్స్ ​దాడి చేశారు. ఈ ఘటన బుధవారం భైంసాలో చోటుచేసుకుంది . వివరాల్లోకి వెళ్తే.. బుధవారం ఇంటర్ ఎగ్జామ్స్​ ముగిశాయి. చివరి రోజు పట్టణంలో రాష్ట్ర పరిశీలకులు పలు సెంటర్లలో తనిఖీలు చేస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న ఇక్కడి సెంటర్ల నిర్వాహకులు మాస్ కాపీయింగ్ జరగకుండా ఇన్విజిలేటర్లు స్ట్రిక్ట్​ చేశారు. ఓ ప్రైవేట్ కాలేజీలో తమను మాస్ కాపీయింగ్ చేయనీయలేదని కొందరు పరీక్ష తరువాత ఇన్విజిలేటర్ పై దాడికి పాల్పడ్డారు. దాడి చేస్తూ బూతులు తిట్టడంతో పాటు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సిబ్బంది పై సైతం దాడికి పాల్పడ్డారు. దీంతో ఇన్విజిలేటర్​ స్టూడెంట్స్​పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన పది మంది స్టూడెంట్స్​పై పోలీసులు కేసు నమోదు చేశారు.