బెటాలియన్‌‌‌‌లో ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన

బెటాలియన్‌‌‌‌లో ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన

రాజన్న సిరిసిల్ల, వెలుగు : పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్‌‌‌‌‌‌‌‌ క్యాంపును విద్యార్థులు వినియోగించుకోవాలని సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్​రెడ్డి తెలిపారు.  సిరిసిల్లలోని 17వ బెటాలియన్‌‌‌‌లో పోలీస్ శాఖకు సంబంధించి ట్రైనింగ్‌‌‌‌, టెక్నాలజీ వినియోగం, వెపన్స్‌‌‌‌..

తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డీఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు, యువత కోసం సిరిసిల్ల, వేములవాడ, ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట పీఎస్‌‌‌‌ల పరిధిల్లో ఎస్పీ ప్రత్యేక చొరవతో  నెల రోజుల పాటుగా సమ్మర్‌‌‌‌‌‌‌‌ క్యాంపు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.