మహబూబ్ నగర్ రూరర్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీలో సమస్యలను పరిష్కరించాలని గురువారం పీయూ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు పరిపాలన భవనాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా పీయూ జేఏసీ చైర్మన్ బత్తిని రాము మాట్లాడుతూ.. యూనివర్సిటీలో కొన్ని సంవత్సరాలుగా గర్ల్స్ హాస్టల్లో సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు శాంక్షన్ అయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
హస్టళ్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ గిరిజ మంగా తాయరు, అకాడమిక్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి ధర్నా శిబిరానికి చేరుకొని మార్చి చివరి నాటికి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా ముగించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పీయూ అధ్యక్షుడు మహేశ్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు మారుతి, పీయూ అధ్యక్షుడు జగదీశ్, స్వేరోస్ రాష్ట్ర నాయకుడు రూప్ సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.