మెస్ చార్జీల పెంపుతో స్టూడెంట్స్ సంబురాలు

  • విద్యానగర్‌‌ నుంచి బీసీ భవన్ వరకు ర్యాలీ 

ముషీరాబాద్, వెలుగు: మెస్ చార్జీలు పెంచినందుకు బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సీఎంకు కృతజ్ఞతగా స్టూడెంట్స్ విద్యానగర్‌‌లోని బీసీ భవన్ వరకు ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ..  పదేళ్లలో 390 సార్లు ధర్నాలు, ర్యాలీలు జరిపినా గత ప్రభుత్వం  సమస్యలను పరిష్కరించలేదన్నారు.

మెస్ చార్జీల పెంపుపై  విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.  విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ మాట్లాడుతూ..  గత ప్రభుత్వం ఇచ్చిన మెస్ చార్జీల బిల్లు చాయ్, బిస్కెట్లకు సరిపోలేదని విమర్శించారు.  కార్యక్రమంలో గొరిగే మల్లేశ్ యాదవ్, వీరన్న, రుషి కుమార్‌‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.