స్కూల్​లో క్వాలిటీ ఫుడ్ పెట్టడం లేదని స్టూడెంట్స్ ఫిర్యాదు

స్కూల్​లో క్వాలిటీ ఫుడ్ పెట్టడం లేదని స్టూడెంట్స్  ఫిర్యాదు

గద్వాల, వెలుగు :  స్కూల్​లో మిడ్  డే మీల్స్  క్వాలిటీగా పెట్టడం లేదని జడ్పీ చైర్​పర్సన్​ సరితకు స్టూడెంట్స్​ ఫిర్యాదు చేశారు. బుధవారం కేటిదొడ్డి మండలం నందిని హై స్కూల్​ను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్  తమ స్కూల్​లో సరైన భోజనం పెట్టడం లేదని, అన్నం తినలేక పోతున్నామని వాపోయారు.

టీచర్స్  కొరత ఉందని, తమకు చదువు చెప్పే వారే కరువయ్యారని వాపోయారు. దీంతో చైర్​పర్సన్​ కిచెన్  రూమ్ కి వెళ్లి అన్నం, కూరలను పరిశీలించారు. క్వాలిటీ ఫుడ్  పెట్టకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంఈవో సురేశ్​కు ఫోన్  చేసి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఆమె వెంట కాంగ్రెస్  పార్టీ లీడర్లు తిరుపతయ్య, మధుసూదన్ బాబు, గీత ఉన్నారు.