ఆదిలాబాద్ లో ఘోర ప్రమాదం: బస్సు చక్రాల కింద విద్యార్థి

ఆదిలాబాద్ రవీంద్రనగర్ లో ఘోర ప్రమాదం జరిగింది. ‘విద్యార్థి సంస్థ’లకు చెందిన బస్సు ఢీకొని ఇద్దరు స్టూడెంట్స్ చనిపోయారు. ఒకరు స్పాట్ లోనే చనిపోగా… మరొకరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చనిపోయారు. బస్సు ప్రమాదంలో ఓ విద్యార్థి పూర్తిగా బస్సు టైర్ల కింద ఇరుక్కు పోయింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులు స్కూలుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.