డిగ్రీ ఎగ్జామ్స్‌ వాయిదా వేయాలని ధర్నా

హసన్‌పర్తి, వెలుగు : ఈ నెల 6 నుంచి జరగాల్సిన డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్‌ ఎగ్జామ్స్‌ను వాయిదా వేయాలంటూ శుక్రవారం కేయూ ఎగ్జామ్స్‌ బ్రాంచ్‌ ఎదుట స్టూడెంట్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకతీయ డిగ్రీ కాలేజీ విద్యార్థి నాయకుడు ఉప్పుల శివ మాట్లాడుతూ ఎండ తీవ్రత కారణంగా ఎవరూ బయటకు రావద్దంటూ ప్రభుత్వం చెబుతున్నా యూనివర్సిటీ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదన్నారు.

ఎండ తీవ్రత పెరుగుతున్న టైంలో ఎగ్జామ్స్‌ నిర్వహించడం సరికాదన్నారు. ఎండ తీవ్రతతో పాటు ఎన్నికలను పరిగణలోకి తీసుకుని ఎగ్జామ్స్‌ను వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం కేయూ రిజిస్ట్రార్‌ మల్లారెడ్డికి వినతిపత్రం అందజేశారు.