- కోఠిలో విద్యార్థుల ఆందోళన
బషీర్ బాగ్, వెలుగు : కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళ విశ్వవిద్యాలయాన్ని యూజీసీలో చేర్చాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. శనివారం వర్సిటీ మెయిన్ గేటు వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తమ ఐడి కార్డులో తెలంగాణ మహిళా యూనివర్సిటీగా పేర్కొంటున్నారని..తమ సర్టిఫికెట్లను కూడా గందరగోళంగా ఇస్తున్నారని తెలిపారు. దీనివల్ల తాము నష్టపోయేప్రమాదం ఉందన్నారు. యూజీసీలో చేర్చకపోవడం వల్ల ఏ ప్రాతిపదికన సర్టిఫికెట్లు ఇస్తున్నారో క్లారిటీ లేదన్నారు.
తమ భవిషత్తు అయోమయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని వర్సిటీని యూజీసీలో చేర్చాలని డిమాండ్ చేశారు. వర్సిటీ వీసీ సూర్య ధనుంజయ్ విద్యార్థులను సముదాయించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.